మొదటి 15 గంటలు మేం ఇబ్బంది పడ్డాం: ఉత్తర కాశీ టన్నెల్ కార్మికుడు

మొదటి 15 గంటలు మేం ఇబ్బంది పడ్డాం: ఉత్తర కాశీ టన్నెల్ కార్మికుడు

ఉత్తర కాశీలో సిల్క్యారాలో కూలిపోయిన టన్నెల్ నుంచి 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. 17 రోజుల తర్వాత రెస్క్యూటీమ్ రాత్రిపగలు శ్రమించి కార్మికులను రక్షించారు. అటు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పర్యవేక్షణలో ఈ రెస్క్యూ నిర్వహించారు. టన్నెల్ లో ఇరుక్కుపోయిన కార్మికులకు పైపుల ద్వారా ఆహారం, మందులు, ఆక్సిజన్, ఇతర వస్తువులు పంపించి వారిని 17 రోజులపాటు సజీవంగా ఉండేలా చర్యలు చేపట్టారు. నవంబర్ 12న ఉత్తరకాశీ సమీపంలో సిల్క్యారా వద్ద సొరంగం కూలి 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోగా.. నవంబర్ 28న బయటకు తీసుకువచ్చారు.. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. 17 రోజుల పాటు టన్నెల్ లో ఇరుక్కు పోయిన కార్మికుడు విశ్వజిత్ కుమార్ వర్మ తన అనుభవాన్ని ఇలా తెలియజేశాడు.. 

శిథిలాలు పడిపోగానే మేం.. టన్నెల్లో ఇరుక్కుపోయామని గుర్తించాం.. దీంతో మాలో ఆందోళన మొదలైంది. మొదట్లో దాదాపు 15గంటలపాటు మేం చాలా ఇబ్బంది పడ్డాం.. అయితే ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మాకు బియ్యం, పప్పులు, డ్రైఫ్రూట్స్ అందించేందుకు పైపు ఏర్పాటు చేశారు. దీంతో కొంత ఉపశమనం కలిగింది. అనంతరం మాతో టచ్ లో ఉండేందుకు ఓ మైక్ ను ఏర్పాటు చేశారు. దీంతో మేం మాకుటుంబ సభ్యులతో మాట్లాడాం అని టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికుల్లో ఒకరైన విశ్వజిత్ కుమార్ తెలిపారు. 

నేను ఇప్పుడు సంతోషంగా దీపావళి జరుపుకుంటాను అని విశ్వజిత్ కుమార్ వర్మ తెలిపారు. 

Also Read:- దసరా మళ్లీ వచ్చిందా.. ఓటు కోసం హైదరాబాద్ ఖాళీ..