Gangs of Godavari: పర్ఫెక్ట్ టైమ్లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

Gangs of Godavari: పర్ఫెక్ట్ టైమ్లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవలే గామి(Gaami) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సరికొత్త కథా, కథనాలతో విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక సినిమాలో అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ తనదైన నటనను కనబరిచారు. ఈ సినిమా తరువాత మరో కొత్త తరహా పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్. ఆ సినిమానే గ్యాంగ్స్ అఫ్ గోదావారి. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ దొరకడంలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. మే 17న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఈ రిలీజ్ డేట్ వెనకాల పక్కా ప్లానింగ్ ఉందని అర్థమవుతోంది. ఎందుకంటే. మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పూర్తవుతాయి. దాదాపు నెలరోజులు సాగనున్న ఈ ఎన్నికల హంగామాలో పెద్దగా సినిమాల సందడి ఉండకపోవచ్చు. కాబట్టి ఎలక్షన్స్ ముగిసిన తరువాత జనాలు కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. 

కాబట్టి ఎన్నికలు ముగిసిన నాలుగు రోజుల తరువాత గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాబట్టి.. జనాలనుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ న్యూస్ తెలుసుకున్న విశ్వక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇంత ప్లానింగ్ లో థియేటర్స్ లోకి వస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

ALSO READ:- వరాల వసంతం పవిత్ర రంజాన్