‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్ సేన్, తాజాగా తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. బుధవారం పూజాకార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. ఫస్ట్ షాట్‌కి దిల్ రాజు క్లాప్ కొట్టగా, మరో నిర్మాత సుధాకర్ చెరుకూరి కెమెరా స్విచాన్ చేశారు. వెంకట్ బోయనపల్లి దర్శకత్వం వహించారు.
దర్శకులు వెంకీ అట్లూరి, నిర్మాత రామ్ ఆచంట స్క్రిప్ట్ ని టీమ్‌కి అందజేశారు. నిర్మాతలు గోపీ ఆచంట, సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకులు మల్లిక్ రామ్, శ్రీకాంత్ ఎన్ రెడ్డి, కళ్యాణ్ శంకర్ లాంటి పలువురు సినీ ప్రముఖులు హాజరై టీమ్‌ని విష్ చేశారు. విశ్వక్ కెరీర్‌లో ఇది పదకొండవ చిత్రం. నైంటీస్‌లో రాజమండ్రి పరిసరాల నేపథ్యంలో జరిగిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.