సీఎంను కలిసిన విశ్వబ్రాహ్మణ జేఏసీ

సీఎంను కలిసిన విశ్వబ్రాహ్మణ జేఏసీ

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డిని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల జేఏసీ కన్వీనర్​అనంతోజు బ్రహ్మచారి, జనగామ వాసి అయిన జేఏసీ కోకన్వీనర్​దిగోజు నరసింహచారి ఆధ్వర్యంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు సీఎం, టీపీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్ ను కలిసి సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు.

 అనంతరం పలు సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేసినట్లు నరసింహచారి తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్​ కుందారం గణేశ్​చారి, అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కౌలె జగన్నాథం, నాయకులు పాల్గొన్నారు