‘రాజయోగం’ టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

 ‘రాజయోగం’ టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజయోగం’. రామ్ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. డిసెంబర్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేసిన విశ్వక్ సేన్ ..టీజర్ చాలా బాగుందని, హీరో హీరోయిన్స్ ఇంప్రెసివ్‌‌గా ఉన్నారన్నాడు. సాయి రోనక్ మాట్లాడుతూ ‘రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. డబుల్ మసాలా బిర్యానీ లాంటి సినిమా’ అన్నాడు. సరికొత్త కాన్సెప్ట్‌‌తో  టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉందన్నారు హీరోయిన్స్. యూత్‌‌ని ఆకట్టుకునేలా ఉంటుందన్నారు దర్శకుడు రామ్ గణపతి.

నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమా మా టీమ్ అందరికీ ‘రాజయోగం’ తెస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ఇక రీసెంట్‌గా తనపై అర్జున్ చేసిన ఆరోపణలపై విశ్వక్ మాట్లాడుతూ ‘ నేను చెప్పిన ఏ సూచననూ అర్జున్ గారు పట్టించుకోలేదు. ఆ కథ గురించి మరోసారి డిస్కస్ చేద్దామనే ఆ రోజు షూటింగ్ వద్దని చెప్పాను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా.  మళ్లీ మొదటి మెట్టుకు దిగజారొద్దనే ఈ జాగ్రత్తలు.. అంతే గానీ అర్జున్ గారిని అగౌరవపరచాలని కాదు. నేను ఫ్రొఫెషనల్ నటుడినే. నా అంత కమిటెడ్‌‌గా ఎవరూ ఉండరు’అన్నాడు.