ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కమలదళం నేతలు పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేతలకు ప్రజలు ఏకరువు పెడుతున్నరు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కాలినడకన తిరిగారు. అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు మారుతాయని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిట్లం మండలంలో రోడ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు. రోడ్లు బాగా లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కిలోమీటర్ల రోడ్లను నిర్మించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోడ్ల విషయంలో చర్యలు తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి పిట్లం మండలంలో రోడ్లు వేయించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా స్థానికులకు హామీనిచ్చారు.
బిజెపి పార్టీ చేపట్టిన ప్రజా గోస బిజెపి భరోసా సైకిల్ మోటార్ యాత్ర సందర్భంగా జుక్కలు నియోజవర్గం లోని పలు గ్రామాల్లో బిజెపి పార్టీ జెండా పథకాన్ని ఆవిష్కరించి మోటార్ pic.twitter.com/CQHYbr67In
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) July 23, 2022