ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న దీపాదాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న దీపాదాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి

సికింద్రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం అమ్మవారి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని ఆహ్వానించారు. దీపా దాస్ మున్షీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా దీపా దాస్ మున్షీ మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాలలో జరుపుకునే గొప్ప పండుగగా బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరికీ సుఖశాంతులతో పాడిపంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. 

ALSO READ | లష్కర్​ బోనాలకు రండి

గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న పరంపర ఎంతో గొప్పదని ప్రతి కుటుంబం అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి. పూజా కార్యక్రమాలను నిర్వహించగా.. ఆలయ అర్చకులు ఆమెను శాలువాతో సత్కరించి అమ్మవారి చీరను బహకరించారు.