
గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘విశ్వం’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ ఫస్ట్ స్ట్రైక్ పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ పవర్‌ఫుల్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఓ పెళ్లి వేడుకకు వెళ్లి అందర్నీ గన్‌తో కాల్చేసి.. అక్కడ బిర్యానీ తింటూ ‘దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్... ఇస్పే లిఖా మేరే నామ్..’ అని చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. విజువల్స్‌తో పాటు చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. ‘తెగిపడటం, తెగించగలగటం, విధాత విశ్వం.. నిలబడటం, నియంతల గుణం, నిరంతర రణం’ అంటూ సాగిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా నిలిచింది. గోపీచంద్ నటిస్తున్న 32వ సినిమా ఇది. గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు.