విటమిన్‌‌–బి6  లోపిస్తే...

విటమిన్‌‌–బి6  లోపిస్తే...

శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్‌‌–బి6 కూడా ఒకటి. దానివల్ల శరీర పనితీరు మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారు. అదే విటమిన్‌‌–బి6  లోపిస్తే? ఆరోగ్యానికి నష్టం. ఎలా అంటే..

  • శరీరంలో ప్రొటీన్స్‌‌, మంచి ఫ్యాట్‌‌, కార్బోహైడ్రేట్స్‌‌, ఎర్ర రక్త కణాలు, మెటబాలిజం ఉత్పత్తికి విటమిన్‌‌–బి6 అవసరం.
  • గర్భిణుల్లో విటమిన్‌‌–బి6 తగ్గితే ఎనీమియాతో పాటు, పుట్టబోయే పిల్లలు శారీరక లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది.
  • శరీరంలో విటమిన్‌‌–బి6 తగ్గడం వల్ల కంటి సమస్యలు వస్తాయి. నాలుక, పెదవులు పొడిబారడం, పగలడం కూడా విటమిన్‌‌–బి6 లోపానికి కారణాలే. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు, నోటిపూత కూడా వస్తాయి.
  • విటమిన్‌‌–బి6 తగ్గితే ఏ పని చేయకపోయినా ఎప్పుడూ బద్ధకంగా, అలసిపోయిన ఫీలింగ్‌‌ కలుగుతుంది. చేతులు, పాదాల్లో గుచ్చినట్టు అనిపిస్తుంది. డిప్రెషన్‌‌ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

తినాల్సినవి:  

  • విటమిన్‌‌–బి6 లోపించినవాళ్లు చేపలు, మటన్, క్యారెట్‌‌, అవకాడో, పిస్తా పప్పు ఎక్కువగా తినాలి. 
  • తోటకూర, బచ్చలి కూర, పుదీన, పాల కూరల్లో కూడా విటమిన్‌‌–బి6 పుష్కలం. పచ్చి శనగల మొలకలు, ఎండు మిర్చి, అన్ని రకాల పప్పులు, అరటి పండ్లు తినాలి. 
  • ఇవి తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌‌‌‌, కంటి సమస్యల వంటివి రాకుండా చూసుకోవచ్చు. ఇవి నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.