HEALTH TIPS: సరిగా నిద్ర పట్టడం లేదా.. అయితే మీకు ఏ హార్మోన్ అవసరమంటే...

 HEALTH TIPS: సరిగా నిద్ర పట్టడం లేదా.. అయితే మీకు ఏ హార్మోన్ అవసరమంటే...

వేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. రాత్రిపూట తక్కువ నిద్ర పోవడంతో దాని ప్రభావం ఉద్యోగంపై, చదువులపై తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా?శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.   చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుూ ఉంటారు.  అయితే విటమిన్ల లోపం ఉంటే నిద్ర పట్టదని వైద్య నిపుణులు చెపుతున్నారు.  నిద్రలేమి సమస్యను అధిగమించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . 

Also Read : కుంగిపోయిన బ్యారేజీని చూసేందుకు రాహుల్ గాంధీ రావాల్నా : శ్రీధర్ బాబు

నిద్ర గొప్ప ఔషదం అని అంటారు. ప్రతి రోజూ మంచి నిద్ర ఉంటే సగం రోగాలను నయం చేసుకున్నట్టే. కానీ దురదృష్టవశాత్తు చాలామంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. రాత్రవ్వగానే పక్కమీద వాలడం, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లడం, ఏవేవో ఆలోచన చెయ్యడం ఇలా గంటలు గంటలు గడిపి ఎప్పుడో తెల్లవారు జామున రెండు లేదా మూడు గంటలకు నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. 

ఆరోగ్యనిపుణులు నిద్రలేమి(insomnia) సమస్యకు విటమిన్ డి  లోపం ప్రధాన కారణం అని చెబుతున్నారు. విటమిన్- డి(Vitamin-D) లోపం వల్ల కలత నిద్ర, నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం, నిద్ర సమయంలో అసహనం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. నిద్ర చక్కగా పట్టాలంటే మెలటోనిన్(melatonin) హార్మోన్ సరిపడినంత స్థాయిలో ఉండాలి. శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్ -డి ప్రధాన వనరు. శరరంలో విటమిన్-డి లోపించినప్పుడు నిద్ర హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు తీవ్రమైన అసహనం, అసౌకర్యం ఏర్పడుతుంటుంది. ఎందుకంటే నిద్ర సరిగా లేకపోతే శరీరంలో నాడీవ్యవస్థ విశ్రాంతి తీసుకోవడం జరగదు.

నిద్రలేమికి విటమిన్- డి లోపమే కాకుండా మరొక కారణాన్ని కూడా వైద్యులు సూచించారు. శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల(happy hormones) ఉత్పత్తి పెరిగితే శరీరం ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఈ కారణంగా సరిగా నిద్రపోలేరు. నిద్రలేమి సమస్యను అధిగమించడానికి, విటమిన్- డి లోపాన్ని భర్తీ చేయడానికి విటమిన్- డి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి(vitamin-D rich foods). ఉదయం, సాయంత్రం సూర్యరశ్మిలో కొద్దిసేపు గడపాలి. పుట్టగొడుగులు , గుడ్లు, సోయా మిల్క్, బాదం మిల్క్, నారింజ రసం, సముద్రపు ఉత్పత్తులు మొదలైన ఆహారాలు తప్పకుండా తీసుకుంటూ ఉంటే విటమిన్- డి లోపం పరిష్కారమై మంచి నిద్ర పడుతుంది.