బాల్క సుమన్కు ప్రజల సేవ కంటే ఇసుక దందానే ముఖ్యం : వివేక్ వెంకటస్వామి

 బాల్క సుమన్కు ప్రజల సేవ కంటే ఇసుక దందానే ముఖ్యం : వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.  తెలంగాణ రాకముందు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే.. . దానిని కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో 6 లక్షల కోట్ల అప్పుగా మార్చిండని విమర్శించారు.   మందిమర్రిలోని మామిడిగట్టులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  తెలంగాణలో లక్షల కోట్లు అప్పైన చెన్నూరు ప్రాంతానికి చేసిన  అభివృద్ధి ఏమీ లేదన్నారు.  

దళితబంధు, డబల్ బెడ్ రూమ్  లాంటి సంక్షేమ పథకాలు ఏవీ కూడా ఈ ప్రాంతానికి రాలేదన్నారు.  స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ప్రజల సేవ కంటే..  ఇసుక దందానే ముఖ్యమన్నారు.  గ్రామంలో ఎవరైనా చనిపోతే పరామర్శకు కూడా రాని వ్యక్తి బాల్క సుమన్ అని చెప్పారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పరం పోగు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.  బ్యాలెట్ పేపర్ లో చేతి గుర్తు నాలుగో నెంబర్ లో ఉంటుందని  ఓటు వేసి గెలిపించాలని వివేక్ కోరారు.  

బాల్క సుమన్ ప్రజల భూములు గుంజుకుని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు,  క్రీడా మైదానాలు  ఏర్పాటు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు.  బాల్క సుమన్ వెయ్యి కోట్లు సంపాదించాడని తాను నిరూపిస్తానని అన్నారు. ప్రజల బాధలు అర్థం కానీ.. కనీసం ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయని ఎమ్మెల్యేకు మళ్లీ ఎందుకు ఓటు వేయాలన్నారు.  మనసున్న మహారాజు వివేక్ వెంకట స్వామిని  గెలిపించాలని ప్రజలను కోరారు.