అక్రమ మైనింగ్పై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: వివేక్ వెంకటస్వామి

అక్రమ మైనింగ్పై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: వివేక్ వెంకటస్వామి

అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ లీడర్ల దాడిని ఖండించారు  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి . పెద్దపల్లి జిల్లాలో  ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో చెరువు నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మట్టిని తరలించడాన్ని ప్రశ్నించిన  బీజేపీ కార్యకర్త సంపత్ పై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు.  మైనింగ్, రెవెన్యూ, ఆర్టీవో  అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని సంపత్ ఆరోపించారు.  దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వివేక్ వెంకటస్వామి సంపత్ ను పరామర్శించారు.  అధికార పార్టీ నాయకులు అక్రమంగా మట్టి తరలించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు.  అక్రమ మైనింగ్ పై  ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని  అన్నారు.  సీఐతో మాట్లాడి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ కు పరామర్శ

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సతీమణి జువ్వాడి సుమతి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.  వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి జువ్వాడ సుమతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.