తెలంగాణ వాయిస్ వినిపించేందుకే వీ6 ఛానల్ పెట్టాం: వివేక్​ వెంకటస్వామి

తెలంగాణ వాయిస్ వినిపించేందుకే వీ6 ఛానల్ పెట్టాం: వివేక్​ వెంకటస్వామి

హన్మకొండ​:  ఉద్యమ సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా  ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్​ అధినేత సోనియాగాంధీ ఇచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  సోమవారం హన్మకొండలో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి ఆధ్యర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు యశస్వినీ రెడ్డి, గండ్ర సత్యనారాయణ,  ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, టీజేఎస్​ అధ్యక్షుడు కోదండ రాం, మాజీ ఎంపీలు మధు యాష్కీ, అంజన్​ కుమార్​  యాదవ్​ తదితరులు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. నాటి ఉద్యమకారులను ఈ సందర్భంగా సన్మానించారు.  అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ  ఉద్యమ సమయంలో తెలంగాణ వాయిస్ వినిపించేందుకే వీ6 ఛానల్ పెట్టామన్నారు. వీ6 ఛానల్​ తో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  ప్రపంచానికి  చాటి చెప్పామన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్​ ఎంపీలుగా తాము తీవ్ర పోరాటం చేశామన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిందేనని రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి తేల్చి చెప్పామన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని సోనియాకు వివరించామన్నారు.  

పార్లమెంట్ లో బిల్లు పాస్​ కావడానికి జైపాల్ రెడ్డి తీవ్ర కృషి చేశారు. పార్లమెంట్ లోపలా, బయటా తెలంగాణ కోసం పోరాడామన్నారు.  తెలంగాణ ఎంపీల నిరసనలు, ఆందోళనలు అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఉద్యమ సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన టైం లోనూ చాలా అడ్డంకులు వచ్చాయి.