క్రీడలతో మానసిక ఉల్లాసం

క్రీడలతో మానసిక ఉల్లాసం

మెహిదీపట్నం, వెలుగు: ప్రతి ఒక్కరు ఏదో ఓ క్రీడలో పాల్గొంటే ఉల్లాసంగా ఉంటారని మాజీ ఎంపీ, బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌ వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. బుధవారం గచ్చిబౌలి బౌల్డర్‌‌‌‌ హిల్స్‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌ కంట్రీ క్లబ్‌‌‌‌లో నిర్వహించిన గోల్ఫ్‌‌‌‌ క్రీడలు టీ9, ఆర్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ను ‘ఆటమ్‌‌‌‌’ బైక్‌‌‌‌ సంస్థ స్పాన్సర్‌‌‌‌ చేసింది. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌ మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు చాలా ఉల్లాసంగా ఉంటారన్నారు. చాలా మంది గోల్ఫ్‌‌‌‌ను విజయవంతం చేశారని గుర్తు చేశారు. ఇక ఆటమ్‌‌‌‌ బైక్‌‌‌‌ల్లో కొత్తగా 60 కిలోమీటర్ల స్పీడ్‌‌‌‌తో ఎలక్ట్రిక్​ బైక్‌‌‌‌ను త్వరలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 25 కిలోమీటర్ల బైక్‌‌‌‌ ధర చాలా తక్కువగా ఉందన్నారు. మెయింటెనెన్స్‌‌‌‌ చార్జెస్​ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నారు. కేవలం నాలుగు గంటల్లోనే మొత్తం బ్యాటరీ (100 కిలోమీటర్లు)ని చార్జ్‌‌‌‌ చేయొచ్చన్నారు. సేఫ్టీ, క్వాలిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్‌‌‌‌, ఆయన సతీమణి సరోజా వివేక్‌‌‌‌, కుమారుడు వంశీ కృష్ణ పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం

వేసవి అయిపోతుంది..ఇంకెప్పుడు బాగుచేస్తరు?

పెట్టుబడుల వరద రాబోతుందంటారు.. కానీ