పోలీసుల సహాయంతోనే అర్వింద్ ఇంటిపై దాడి: వివేక్ వెంకటస్వామి

పోలీసుల సహాయంతోనే అర్వింద్ ఇంటిపై దాడి: వివేక్ వెంకటస్వామి

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఖండించారు. అర్వింద్ ఇంటిపై దాడి చేసింది తెలంగాణ వ్యతిరేకులేనని అన్నారు. పోలీసుల సహాయంతో టీఆర్ఎస్ గుండాలు అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. డీ.శ్రీనివాస్ సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి చొరబడి  విధ్వంస సృష్టించడం దారుణమన్నారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు.

2004లో  టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో డీఎస్, కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఉద్యమాన్ని  రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ డీఎస్, వెంకటస్వామి కేసీఆర్ కు మద్దతు ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో డీఎస్, వెంకటస్వామి పాత్ర కీలకమని అన్నారు. కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వ్యతిరేకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి విమర్శించారు.