కేసీఆర్ పాలనలో ప్రతీ బిడ్డపై లక్ష రూపాయల అప్పు : వివేక్ వెంకటస్వామి

 కేసీఆర్ పాలనలో ప్రతీ బిడ్డపై  లక్ష రూపాయల అప్పు :   వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల ధనాన్ని ఖర్చు చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఏపీలో ఎన్నికల కోసం 500 కోట్లు, మహారాష్ట్ర లో 500 కోట్లు, పంజాబ్ లో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో పుట్టిన ప్రతీ బిడ్డపై లక్ష రూపాయల భారం పడిందన్నారు వివేక్. ఆంధ్రా పాలకుల పెత్తనం వద్దన్న కేసీఆర్.. మేఘ కృష్ణారెడ్డికి కాళేశ్వరం కాంట్రాక్టర్ బాధ్యతలను ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 

 

మేఘ కృష్ణారెడ్డి ఆఫీస్ లో కూర్చుని బాల్కసుమన్ కమీషన్లు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వివేక్ వెంకటస్వామి. తర్వాత అంగ్రాస్ పల్లిలోనూ ఎన్నికల ప్రచారం చేశారు.

వివేక్ సమక్షంలో పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.