కేసీఆర్ కుట్ర.. అసెంబ్లీలో ఈటల మొహం చూడొద్దని

కేసీఆర్ కుట్ర.. అసెంబ్లీలో ఈటల మొహం చూడొద్దని

ఈటలకు పేరు రావడం సీఎం తట్టుకోలేకపోయారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కరోనా సమయంలో కష్టపడి పనిచేయడం కేసీఆర్ కు నచ్చలేదన్నారు. ప్రజా సమస్యలపై అడిగినందుకే కేసీఆర్ ఈటలపై కక్ష కట్టారన్నారు.ముఖ్యమంత్రి పదవికోసం ఈటల ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఈటల మొహం అసెంబ్లీలో చూడకూడదని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. హుజరాబాద్ లో ఓట్ల కోసమే కొత్త పథకాలు తెచ్చారన్నారు . హుజురాబాద్ లో ఓడిపోతామని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు. TRS పార్టీ  చేస్తున్న తప్పుడు  ప్రచారాలు  నమ్మొద్దని, ఈటల చేసిన  అభివృద్ధి పనులను  చూడాలన్నారు.  ప్రతీ పథకం  ఈటల రాజేందర్ రాజీనామా వల్లే వస్తుందన్నారు. మోడీ ఫోటో పెట్టాల్సి వస్తుందని ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదన్నారు. హుజురాబాద్ లోని  గాంధీనగర్, పద్మానగర్ లో  ఇంటింటి  ప్రచారం నిర్వహించారు  వివేక్ వెంకటస్వామి.  బీజేపీ అభ్యర్థి  ఈటల రాజేందర్ ను  గెలిపించాలని ఇంటింటికి  వెళ్లి   ఓటర్లకు విజ్ఞప్తి  చేశారు.  వివేక్ వెంట.. బీజేపీ  దళిత మోర్చా అధికార  ప్రతినిధి  సూర్య నారాయణ...ప్రచారంలో పాల్గొన్నారు.