ఆరె కుల సమస్యల పరిష్కారానికి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తుర్రు

ఆరె కుల సమస్యల పరిష్కారానికి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తుర్రు

ఆరె కుల సమస్యల పరిష్కారానికి వివేక్ వెంకటస్వామి ఎన్నో రోజులగా పోరాడుతున్నారని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని సెంట్రల్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీస్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యానికి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలపై సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సెక్రటరీ సానుకూలంగా స్పందించారని శివాజీ తెలిపారు. 

కాగా బుధవారం ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వివేక్ వెంకట్ స్వామి, చెట్టిపల్లి శివాజీ  కలిశారు. ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై మంత్రితో చర్చించారు. తమ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని శివాజీ తెలిపారు. కులాల జాబితాపై ఓబీసీ కమిషన్ వద్ద ఉన్న రిపోర్ట్​ను సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారని చెప్పారు. అనంతరం రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను కలిసి తమ సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు శివాజీ పేర్కొన్నారు.