
ఎన్నికలప్పుడు హామీలిచ్చి తర్వాత మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటు అయిందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి . జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లిలో ఈటలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నాగార్జున సాగర్, హుజుర్ నగర్ లో హమీలిచ్చి మర్చిపోయాడని..హుజురాబాద్ లో కూడా హామీలిచ్చి మర్చిపోతాడన్నారు. అలాంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలన్నారు. పిల్లలకు మద్యం తాగించి, బిర్యాని తినిపించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారు.సీఎం కేసీఆర్ మంత్రులనే కలవరని.. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు లోపలికి వెళ్లనీయకుండా కారును ఆపేశారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేయకపోయినా ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజల్లో ఉండే ఈటలను గెలిపించాలన్నారు.
పెట్రోల్ ధర మీద కేంద్రం ఎక్కువ పన్ను వేస్తుందని ఆరోపిస్తున్నారన్నారు. పెట్రోలు ధరలో రాష్ట్రానికి రూ. 42 పన్ను వెళ్తుందని.. కేంద్రానికి రూ.25 మాత్రమే వస్తుందన్నారు. గ్యాస్ ధరలో రూ.22 కేంద్రానికి వెళ్తుందన్నారు. సిమెంట్ ధర రూ. 2050 ఉంటే రూ.450 కే వస్తుందన్నారు. ఇక్కడి సీఎం క్వార్టర్ మద్యం రూ.100 ఉంటే రూ.200 చేశారన్నారు. ఓట్ల కోసమే సీఎం జిమ్మిక్కులు చేస్తున్నాడన్నారు. ఆస్తులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు.