
హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో మళ్లీ గెలుస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, కుష్టగి నియోజకవర్గ ఇన్ చార్జ్ వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన నచ్చి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. కుష్టగి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం బీజేపీలో చేరగా.. వివేక్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలోని హనుమనగర్ లో బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖ్ లు, మహాశక్తి కేంద్రాల ప్రముఖ్ లు, పంచాయతీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. చెల్లేరిగి గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు.