
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బైక్ ర్యాలీని ప్రారంభించారు. కాళేశ్వరం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిపై సమయం వచ్చినప్పుడు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. బ్రాహ్మణ పల్లిలో బైక్ పై తిరిగి ప్రజా సమస్యలు వివేక్ వెంకట స్వామి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ కేంద్రానికి వివరిస్తానని చెప్పారు.