
న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిలో కారుణ్య నియామకాలు జరిగేలా చూడాలని, కార్మికులకు న్యాయం చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ విషయంపై గురువారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రిని కలిసి అన్ని వివరాలతో రిప్రజెంటేషన్ ఇచ్చారు. 800 మందిని కారుణ్య నియమకాల కింద తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం గతంలో హామీ ఇచ్చి అమలు చేయలేదని కేంద్ర మంత్రికి చెప్పారు. మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ అయ్యాక కూడా వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోలేదన్నారు. నష్టపోయిన బాధిత కార్మికులతో చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలోమీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. తన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వివేక్ వెంకటస్వామి చెప్పారు.