బాల్క సుమన్​కు ఓటమి తప్పదు : వివేక్​ వెంకటస్వామి

బాల్క సుమన్​కు ఓటమి తప్పదు :  వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్​,వెలుగు:  ఎమ్మెల్యే బాల్కసుమన్ అవినీతి, అక్రమాలు, దోపిడీ దౌర్జన్యాలతో విసుగు చెందిన ప్రజలు ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధమయ్యారని చెన్నూరు కాంగ్రెస్​అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లోని వార్డుల్లో నిర్వహించిన కాంగ్రెస్​ చేరికల సమావేశాల్లో ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వివేక్​ తనయుడు గడ్డం వంశీకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీనిలో గద్దెరాగడిలో, మందమర్రి మున్సిపాలిటీలోని 1,2,8,12,16,20,22 వార్డులకు చెందిన బీఆర్​ఎస్​ లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. దీపక్​ నగర్​కు చెందిన సీనియర్​ బీఆర్ఎస్​ లీడర్లు నామని ముత్తయ్య, పోలు శ్రీనివాస్​, కాసర్ల శ్రీనివాస్​, మహాదేవుని రమేశ్, డాక్టర్​ రామయ్య,  పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఎండీ, ఇషాక్, చెన్నూరు  నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్​చార్జి ఎండీ, జావీద్ ఖాన్, ఎనిమిదో వార్డు ప్రెసిడెంట్​ విరుగురాల వెంకన్న, 2 వార్డులో సాగర్, సింగరేణి శ్రీనివాస్​, జిల్లా రాజు, 20 వార్డుకు చెందిన మేము సైతం స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్​ బుబత్తుల శ్రీనివాస్,  సాయి, 22 వార్డులో వనం నర్సయ్య

  సింగరేణి సివిల్​ కాంట్రాక్టర్లు బర్ల నాగమల్లేశ్​, చంద్రశేఖర్​, గోమాస వెంకటేశ్, రంజిత్​కుమార్​, పెద్దపల్లి శ్రీనివాస్, పిడుగు రాజేందర్​​లతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్​ శ్రేణులు కాంగ్రెస్​లో చేరారు. వీరికి వివేక్​ వెంకటస్వామి, నల్లాల ఓదెలు, వివేక్​ తనయుడు గడ్డం వంశీకృష్ణ పార్టీ కండువాలు కప్పారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై వివేక్​ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు. ఫయాజ్​,  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తనయుడు క్రాంతికుమార్​, దుర్గం నరేశ్​, గుడ్ల రమేశ్​, బండి సదానందం, మహంకాళీ శ్రీనివాస్​, పుల్లూరి లక్ష్మన్​,  నోముల ఉపేందర్​గౌడ్​, సోత్కు సుదర్శన్​, పల్లె రాజు, గోపతి రాజయ్య, పైడిమల్ల నర్సింగ్​, పాషా, ఒడ్నాల శ్రీనివాస్​,  మండ భాస్కర్​, బత్తుల రమేశ్​, అకారం రమేశ్​, మెట్ట సుధాకర్​ తదితరులు పాల్గొన్నారు. 

వివేక్​ వెంకటస్వామి గెలుపునకు పూర్తి మద్దతు

కాంగ్రెస్,​-సీపీఐ ఎన్నికల పొత్తులో భాగంగా చెన్నూరు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి గెలుపు కోసం కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తారని ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్​ అన్నారు. శుక్రవారం రాత్రి రామకృష్ణాపూర్​లోని ఏఐటీయూసీ ఆఫీస్​లో వివేక్​ వెంకటస్వామితో కలిసి సీపీఐ శ్రేణులు  కలిసి సంయుక్తంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతు చెన్నూరులో వివేక్ వెంకటస్వామి గెలుపునకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.  కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎట్లైనైతే కష్ట పడతామో అలానే వివేక్ ను గెలిపిస్తామన్నారు. సమావేశంలో  సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మన్​, ఏఐటీయూసీ సెంట్రల్​ సెక్రటరీ అక్బర్​అలీ, టౌన్​ ప్రెసిడెంట్​ మిట్టపల్లి శ్రీనివాస్, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్​, భీమనాధుని సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ ఏర్పాటులో వివేక్‌ది కీలకపాత్ర
వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ

తెలంగాణ ఏర్పాటులో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని ఆయన సతీమణి సరోజ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వివేక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్‌ గ్రామంలో సరోజ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు సర్పంచ్ పద్మజ, మహిళల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లతో కలిసి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

ALSO READ: ధరణిలో కేసీఆర్​కుగుంట భూమి ఎక్కువ​పడ్డది

కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం టైమ్‌లో ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు. తమది కాంగ్రెస్ కుటుంబమని సరోజ చెప్పారు. అనంతరం గ్రామంలో మహిళలతో కలిసి కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీడర్లు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, చల్లా విశ్వంభర్ రెడ్డి, పాపి రెడ్డి, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.