తాడిచెర్ల స్కాంపై సీపీఐ, సీపీఎం కేసీఆర్ ను నిలదీయాలి: వివేక్ వెంకటస్వామి

తాడిచెర్ల స్కాంపై సీపీఐ, సీపీఎం కేసీఆర్ ను నిలదీయాలి: వివేక్ వెంకటస్వామి

తాడిచెర్ల మైన్ ను ప్రైవేట్ కంపెనీ అయిన ఏఎమ్మాఆర్ కు కేసీఆర్ ఎందుకు కేటాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. తాడిచెర్ల మైన్ లో కేసీఆర్ కు కూడా వాటా ఉందన్నారు. కోల్ ఇండియా యావరేజ్ ప్రైజ్ టన్నుకు రూ. 500 ఉంటే.. కేసీఆర్ ఏఎమ్మార్ కు  రూ.2500లకు టన్ను చొప్పున కేటాయించారన్నారు. తాడిచెర్ల మైన్ లో రూ. 20 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై సీపీఎం, సీపీఐ పార్టీలు కేసీఆర్ ను నిలదీయాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు  ప్రకారం కోల్ బ్లాక్ ల ను కేంద్రం కేటాయిస్తుందన్నారు. తాడిచెర్ల మైన్ లో వాటా ఎంతో ఉందో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలన్నారు. 

సిట్ విచారణతో ఒరిగేదేం లేదు: బండి సంజయ్

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సీఎం కేసీఆర్ను సాక్షిగా విచారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిందితులు, ఫిర్యాదుదారులు, కోర్టులు చెప్పాల్సింది కూడా కేసీఆరే చెప్తున్నారని విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. సిట్ విచారణతో ఒరిగేదేమిలేదని..సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బీజేపీ ఉందని కేసీఆరే చెప్పారని.. అందుకే కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.