
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఈటల రాజేందర్ విజయోత్సవ సభకు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు. హుజురాబాద్ లో 500 కోట్లను కేసీఆర్ ఖర్చు పెట్టారన్నారు. అయినా ఈటల గెలుపును అడ్డుకోలేదన్నారు వివేక్ వెంకటస్వామి..హుజురాబాద్ ప్రజలు ఈటలను గెలిపించి కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు.