
ఢిల్లీ : VRS బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్… ఇప్పుడు ఆ హామీని మరిచారన్నారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి. సింగరేణి VRS బాధితుల సమస్యలపై బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. సింగరేణి ఒత్తిడితో 1997-2001 మధ్య వీఆర్ఎస్ తీసుకున్న కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. గతంలో వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగుల వారసులకు ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని వివేక్ తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరగలేదని తెలిపారు. 1795 మంది కార్మికుల వీఆర్ఎస్ కేసును రీ ఓపెన్ చేయాలని కేంద్రమంత్రిని కోరానన్నారు వివేక్ వెంకటస్వామి. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.