
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో.... రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరలో పాల్గొన్నారు. వివేక్ వెంకటస్వామికి ఘనంగా స్వాగతం పలికారు గౌడ సంఘం నాయకులు, బీజేపీ శ్రేణులు. ఎల్లమ్మ గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. కార్యకర్తలు. అనంతరం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రెండు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన నవీన్ – నిఖిత, మంచిర్యాలకు చెందిన రాహుల్ వర్మ - మహితల వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. .