వరదబాధితులకు వివేక్ వెంకటస్వామి పరామార్శ

వరదబాధితులకు వివేక్ వెంకటస్వామి పరామార్శ

సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయం ద్వారా ఎన్నో గ్రామాలు నీట మునిగిపోయాని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో వరద బాధిత కుటుంబాలను ఆయన పరామార్శించారు. వరదలతో  ఇండ్లు నీటమునిగి అన్ని విధాలుగా నష్టపోయామని బాధితులు వివేక్ వద్ద గోడు వెళ్ళబోసుకున్నారు. ఇప్పటివరకు తమను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రామగుండం మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో  మాట్లాడిన వివేక్ బాధిత కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని కోరారు. 

వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా వరద బాధితుల కుటుంబాలకు నిత్యవాసర సరుకులు పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్న ఆయన..కాళేశ్వరం రీడిజైన్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్టంలో తుక్లాగ్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్ చేశారు.