కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదు : బాల్క సుమన్కు వివేక్ వార్నింగ్

కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదు : బాల్క సుమన్కు వివేక్ వార్నింగ్

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాథనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి వనం గ్రౌండ్ లో మార్కింగ్ వాకర్స్ తో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సమావేశమయ్యారు. చాలా మంది మార్నింగ్ వాకర్స్ తమ సమస్యలను వివేక్ వెంకట స్వామి దృష్టికి తీసుకెళ్లారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, యోగశాల, వాటర్ ఫెసిలిటీ, వాష్ రూమ్స్ కావాలని కోరారు. గాంధారి వనంలో అభివృద్ధి పనులు చేయాలంటే ఫారెస్ట్ అధికారుల అనుమతి అవసరమని, వారి మాట్లాడి త్వరలోనే అన్ని సమస్యలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. 

రవీంద్రఖని రైల్వే ప్లాట్ ఫామ్ లో అజిని ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్ స్టాఫ్ కావాలని కోరారని, రైల్వే అధికారులతో మాట్లాడి సమస్య లేకుండా చేస్తానని వివేక్ వెంకట స్వామి చెప్పారు. గాంధారి వనం పక్కనే ఉన్న రైల్వే పట్టాలు చూస్తే.. తమకు తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో చేసిన రోజులను వివేక్ గుర్తు చేసుకున్నారు. అప్పటి డీజీపీ దినేష్ రెడ్డి అరెస్ట్ చేసి.. తమకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. తమ కూతురు వివాహం రెండు రోజులు ముందు తనను అరెస్ట్ చేశారని.. ఆ సమయంలో బెయిల్ రావడంతో పెళ్లికి హాజరయ్యానని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. బాల్క సుమన్ అవినీతిని చూసి.. కేసీఆరే ఆయన దుస్తులు విప్పి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.