ఘనంగా వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

ఘనంగా వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత గొట్టిముక్కల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 200 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివేక్ వెంకటస్వామి నిరంతరం పని చేస్తున్నారని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. జన్మదిన వేడుకల్లో బీజేపీ నాయకులు, వివేక్ వెంకటస్వామి అభిమాలు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోనూ వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ధర్మపురి హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వెల్గటూర్ మాజీ ఎంపీపీ బషీర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెడగండ్ల మండలం నంచర్లలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధర్మారంలో దళిత మోర్చ నాయకులు కాడే సూర్యనారాయణ బీజేపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత పండ్లు పంపిణీ చేశారు.

సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో వివేక్ వెంకటస్వామి అభిమానులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అరెపల్లి రాకేష్, పల్లె తిరుపతి యాదవ్, శ్యామ్, అరెపల్లి రాహుల్, కొల్లూరి సంతోష్, బాలసాని సతీష్ గౌడ్ అడ్డగుంట శ్రీనివాస్ పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గౌతమ్ నగర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు రాజేందర్ పాల్గొన్నారు.