వివేక హత్య కేసు : తీర్పు రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు

వివేక హత్య కేసు : తీర్పు రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యేవరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు సూచించింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో (మార్చి14న) రేపు సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన అవినాష్ తరపు న్యాయవాది కోరారు. అందుకు సీబీఐకి లేఖ పెట్టుకోవాలని హైకోర్టు చెప్పింది. అంతకుముందు సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైఎస్ వివేకా కూతురు సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తముందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఆరోపించారు. సునిత అభియోగం వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, వివేకా హత్య అయిన ఏడాది తర్వాత సునీత ఆరోపణలు చేస్తుందని తెలిపారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీమ్ ల పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని న్యాయవాది అన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు జరగాలని కోరారు.

వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియో గ్రఫీ, ఆడియో గ్రఫీ, కేసు వివరాలను షీల్డ్ కవర్‌లో  సీబీఐ కోర్టుకుసమర్పించింది . దాంతో పాటు 35 మంది సాక్షులుస్టేట్మెంట్లు, 10 డాక్యుమెంట్ల , హార్డ్ డిస్క్ లను సైతం సీబీఐ నివేదించింది. స్పాట్ లో దొరికిన లెటర్, ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది.