వివో వై27 లాంచ్‌‌‌‌

వివో వై27 లాంచ్‌‌‌‌


ఎల్​ అండ్​ టీ షేర్ల  బైబ్యాక్​

ముంబై: ఇంజినీరింగ్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగాలలోని ఎల్​ అండ్​ టీ షేర్ల బైబ్యాక్​ ప్రపోజల్​ పరిశీలిస్తోంది. వచ్చే వారంలో క్వార్టర్లీ రిజల్ట్స్​ పరిశీలన కోసం జరిగే బోర్డు మీటింగ్​లోనే షేర్ల బైబ్యాక్​తో పాటు, స్పెషల్​ డివిడెండ్​  చెల్లింపు ప్రపోజల్​ కూడా డిస్కషన్​కి రానున్నట్లు కంపెనీ స్టాక్​ఎక్స్చేంజీలకు తెలిపింది.  ఈ నెల 25 న ఎల్​ అండ్​ టీ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. బైబ్యాక్ ​ ప్రపోజల్​కు  బోర్డు ఆమోదం తెలిపితే, ఆగస్టు 2 రికార్డు డేట్​ అవుతుందని కంపెనీ పేర్కొంది.  ఈ అనౌన్స్​మెంట్​కి ముందు గురువారం సెషన్లో ఎల్​ అండ్​ టీ షేర్లు బీఎస్​ఈలో  రూ. 2,489.60 వద్ద ఫ్లాట్​గా క్లోజయ్యాయి. గత మూడు నెలల్లో ఎల్​ అండ్​ టీ షేరు 11.44 శాతం లాభపడింది.

60 సెకన్లలోనే  సైట్స్‌‌‌‌60తో వెబ్‌‌‌‌సైట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీ–హబ్‌‌‌‌లో ఇంక్యుబేషన్ పీరియడ్‌‌‌‌ను పూర్తి చేసుకున్న స్టార్టప్ కంపెనీ సైట్స్‌‌‌‌60 డాట్‌‌‌‌కామ్‌‌‌‌ 60 సెకెన్లలోనే ఎవరైనా వెబ్‌‌‌‌సైట్ క్రియేట్‌‌‌‌ చేసుకోవచ్చని చెబుతోంది. బిజినెస్‌‌‌‌లు సేల్స్‌‌‌‌ పెంచుకోవడానికి తక్కువ టైమ్‌‌‌‌లోనే  వెబ్‌‌‌‌సైట్లను అఫోర్డబుల్‌‌‌‌ ధరకే  రెడీ చేసుకోవచ్చని వెల్లడించింది. సైట్స్‌‌‌‌60డాట్‌‌‌‌కామ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌‌‌‌ రంజన్‌‌‌‌ లాంచ్ చేశారు. టీహబ్‌‌‌‌ సీఓఓ అనిష్‌‌‌‌  ఆంటోని ఈ ఈవెంట్‌‌‌‌లో పాల్గొన్నారు.గ్లోబల్‌‌‌‌గా పది లక్షల చిన్న వ్యాపారాలకు సాయపడాలనే ఉద్దేశంతో సైట్స్‌‌‌‌60డాట్‌‌‌‌కామ్‌‌‌‌ తీసుకొచ్చామని,  2025 నాటికి ఈ టార్గెట్‌‌‌‌ చేరుకుంటామని కంపెనీ ఫౌండర్ రాజీవ్‌‌‌‌ రావులపాటి అన్నారు. ఏడాదికి రూ.6 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు. గ్లోబల్‌‌‌‌గా  34 కోట్ల చిన్న వ్యాపారాలు ఉంటే ఇందులో 29 % వ్యాపారాలకు  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ లేదని,  ఒక్క ఇండియాలోనే 6.3 కోట్ల చిన్న వ్యాపారాలకు వెబ్‌‌‌‌సైట్ లేదని అన్నారు. 

ప్రెస్టీజ్‌‌‌‌ నుంచి కొత్త కుక్‌‌‌‌టాప్‌‌‌‌

కుక్‌‌‌‌టాప్‌‌‌‌ పీఐసీ 20 లో అప్‌‌‌‌గ్రేడెడ్ మోడల్‌‌‌‌ను టీటీకే ప్రెస్టీజ్ లాంచ్ చేసింది. పీఐసీ 20 విజ్‌‌‌‌ 1600 డబ్ల్యూ మోడల్‌‌‌‌లో విజిల్‌‌‌‌ ఫీచర్‌‌‌‌‌‌‌‌ను  ఏర్పాటు చేశారు. ప్రెజర్‌‌‌‌‌‌‌‌ కుక్కర్‌‌‌‌తో వండేటప్పుడు  ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌తో  నచ్చినన్ని విజిల్స్‌‌‌‌ను ముందుగానే పెట్టుకోవచ్చని, ఈ విజిల్స్ తర్వాత  ఆటోమేటిక్‌‌‌‌గా కుకింగ్ ఆగిపోతుందని తెలిపింది.  ధర రూ. 3,695.

వివో వై27 లాంచ్‌‌‌‌

వై 27 పేరుతో కొత్త మోడల్‌‌‌‌ను వివో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌‌‌‌ఫోన్ ధర రూ.14,999 నుంచి స్టార్టవుతోంది. 6.64 ఇంచుల ఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌డీ డిస్‌‌‌‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్‌‌‌‌ హెలియో జీ85 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌,  50 ఎంపీ వెనుక కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌‌‌‌ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌‌‌‌లో ఉన్నాయి.