50ఎంపీ కెమెరాతో వివో టీ4 ప్రో

50ఎంపీ కెమెరాతో వివో టీ4 ప్రో

హైదరాబాద్​, వెలుగు: వివో తన నూతన స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ వివో టీ4 ప్రోను ఇండియాలో విడుదల చేసింది.  దీని ప్రారంభ ధర రూ. 27,999. ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌లో 50ఎంపీ  సోనీ  ఐఎంఎక్స్​882 మెయిన్​ కెమెరా, 50ఎంపీ పెరిస్కోప్ కెమెరా (3 రెట్ల జూమ్‌‌‌‌‌‌‌‌తో) ఉన్నాయి. ముందు భాగంలో 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 

ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 15పై పనిచేసే ఈ ఫోన్​కు, నాలుగు సంవత్సరాల ఓఎస్ అప్‌‌‌‌‌‌‌‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌‌‌‌‌‌‌‌డేట్స్ వస్తాయి. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ల ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ఛార్జ్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. స్నాప్‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్​ను అమర్చారు. డస్ట్​ అండ్​ వాటర్ రెసిస్టెన్స్​ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్​ ఉంటాయి. ఈ నెల 29 నుంచి వివో టీ4 ప్రోను ఆర్డర్​  చేయవచ్చు.