
హైదరాబాద్, వెలుగు: వివో తన సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, వివో వై400ను విడుదల చేసింది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.67 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ దీని ప్రత్యేకతలు.
ఫొటోల కోసం వెనక 50 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 8జీబీ+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999, కాగా 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.23,999. అమ్మకాలు ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతాయి.