విశాఖ సాగర తీరంలో నేవీ వేడుకలు

విశాఖ సాగర తీరంలో నేవీ వేడుకలు

దేశ వ్యాప్తంగా నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు నేవీ సిబ్బంది. నేవీ చీఫ్ అడ్మిరల్ R హరి కుమార్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, IAF చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరితో పాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది నేవీ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులర్పించారు. నేవీ చేపట్టిన ఆపరేషన్స్ ను గుర్తు చేసుకున్నారు.  

మరోవైపు విశాఖలోని సాగరతీరంలో నేవీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని విశాఖపట్నంలో జరుగుతున్న నేవీ డే సెలబ్రేషన్స్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైయ్యారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఏపీకి చేరుకున్నారు. నేవీ డే సెలబ్రేషన్స్ లో ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రపతితో పాటు ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్కే బీచ్ లో నేవీ డే సెలబ్రేషన్స్ కోసం సర్వం సిద్ధమైంది. పది రోజుల ముందు నుంచే నేవీ సిబ్బంది నేవీ డే వేడుకల కోసం రిహర్సల్స్ చేశారు. సాగర తీరాన జరుతున్న నేవీ డే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రిహార్సల్స్ చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు. యుద్ధ నౌకలు, నేవీకి సంబంధించిన హెలికాప్టర్లతో విన్యాసాలు చేశారు. సముద్రంపై మూడు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్ 29కే ద్వారా యుద్ధ ప్రదర్శనలు చేయనున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లు, జెట్ ట్రైనర్ హాక్స్ తో పాటు 25 ఎయిర్ క్రాఫ్ట్ లతో నింగిలో విన్యాసాలు చేయనున్నారు. ఇవాళ జరగనున్న వేడుకలకు కూడా జనం భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

సికింద్రాబాద్ లో నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్ లో నేవీ డే వేడుకలు నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ లోని అమర వీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి అధికారులు నివాళులర్పించారు.