కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు వాలంటీర్లు కావాలి: ఎయిమ్స్‌

కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు వాలంటీర్లు కావాలి: ఎయిమ్స్‌
  • ఎన్‌రోల్‌ చేసుకోవాలని ప్రకటన

న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు వాలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ చేసేందుకు పర్మిషన్‌ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఎయిస్‌ ఎథిక్స్‌ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్‌ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగించాల్సి ఉండగా.. ఎయిమ్స్‌లో 100 మందిపై ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. “ సోమవారం నుంచి ఎన్‌రోల్‌మెంట్‌ ప్రాసెస్‌ లాంచ్‌ చేస్తాం. కరోనా వైరస్‌ సోకని హెల్తీ పార్టిసిపెంట్స్‌ను సెలక్ట్‌ చేస్తాం. క్లినికల్‌ ట్రయల్స్‌కు సహకరించాలి అనుకునే వారు Ctaiims.covid19@gmail.comకి మెయిల్‌ చేయాలని లేదా 7428847499 నంబర్‌‌కి ఎస్‌ఎంఎస్‌ లేదా కాల్‌ చేయాలి” అని ఎయిమ్స్‌ సెంటర్‌‌ ఫర్‌‌ కమ్యూనిటీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌‌ డాక్టర్‌‌ సంజయ్‌ రాయ్‌ చెప్పారు. 18 నుంచి 55 ఏళ్ల వయసు వారు దీనికి అర్హులు అని ఆయన అన్నారు. ఇప్పటికే కొంత మంది వాలంటీర్లు ఎన్‌రోల్‌ చేసుకున్నారని, సోమవారం వాళ్లకు హెల్త్‌ స్క్రినింగ్‌ నిర్వహిస్తామని డాక్టర్‌‌ చెప్పారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికిల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌‌) , భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్ లిమిలెడ్‌ (బీబీఐఎల్‌) సంయుక్తంగా స్వదేశీ వ్యాక్సిన్‌ కొవాక్సిన్‌ను తీసుకొచ్చారు.