
ప్రపంచ దేశాలన్నీ కరోనా అంటే వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా పేరు పెట్టుకున్నవాళ్లు సైతం..ఆ పేరుతో తమని తాము పరిచయం చేసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటి కరోనా తనకు విజయం అందిస్తుందని ఓ మహిళా నేత ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ లో కేరళ కొల్లం కార్పొరేషన్ లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మాథిలిల్ నుంచి కరోనా థామస్ అనే మహిళ బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో ఆమె ఫాలోవర్స్ కరోనా , ఓట్ ఫర్ కరోనా అని స్లోగన్స్ ఇస్తున్నారు. దీంతో ఆమె చేస్తున్న ప్రచారం కార్యకర్తలతో కొల్లం కార్పొరేషన్ సందడిగా మారింది.
ఈ సందర్భంగా కరోనా థామస్ మాట్లాడుతూ డిసెంబర్ నెలలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కరోనానే తనని గెలుపిస్తుందిని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూల్ డేస్ , కాలేజ్ డేస్ లో కరోనా అని పేరుతో పిలిస్తే ఇరిటేట్ అయ్యేదాన్ని..కానీ ఇప్పుడు కరోనా వైరస్ వల్ల తనపేరు బాగా పాపులర్ అయినట్లు చెప్పింది. అంతేకాదు తాను పుట్టినప్పుడు తన తండ్రి ఏరికోరి ఫ్రాన్స్ బాష నుంచి కరోనా అనే పేరును తనకు పెట్టారని, కరోనా అంటే ఆడపిల్ల అని అర్ధమన్నారు బీజేపీ మహిళా నేత కరోనా థామస్