Voter ID Card: ఓటరు డిజిటల్ ఐడీ డౌన్లోడ్ చేసుకోండిలా..

Voter ID Card: ఓటరు డిజిటల్ ఐడీ డౌన్లోడ్ చేసుకోండిలా..

ఓటర్లుకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకనుంచి ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ లో ఓటరు కార్డు ను పొందేందుకు అవకాశం కల్పించింది. అంటే క్షణాల్లో మీరు మీ ఓటరు కార్డును ఆన్ లైన్ ద్వారా డిజిటల్ ఓటరు ఐడీ కార్డును పొందవచ్చు. ఓటరు ఐటీ కోసం ఆన్ లైన్ లోన దరఖాస్తు చేసుకున్న వారు ఇంటి వద్ద నుంచి డిజిట్ ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 

ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోండిలా..

1. ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు సైబర్ కేఫ్ లకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే మీ ల్యాప్ టాప్, కంప్యూటర్ల ద్వారా ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
 2. ఓటరు ఐడీ కార్డును పొందడానికి ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ http://voters. eci.gov.in లాగిన్ చేయాలి. 
3.హోమ్ పేజీలోని E-Epic డౌన్ లోడ్ ఆప్షన్ ను నొక్కాలి. 
4. ఇందులో రిజిస్టర్ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడీ లేదా Epic నెంబర్ వంటి సమాచారం ఇచ్చి క్యాప్యాతో కూడి రిక్వెస్ట్ ఓటిపీ ని నొక్కాలి. 
5.మీ రిజిస్టర్ మొబైల్ ద్వారా అందుకున్న ఓటీపీ ఎంటర్ చేయాలి. 
6. ఇప్పుడు డిజిల్ ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడానికి మీరు eEPIC పై క్లిక్ చేయాలి 
ఇలా చేయడం ద్వారా ల్యాప్ టాప్, కంప్యూటర్ ద్వారా PDF ఫార్మాట్ లో మీ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.