గుజరాత్లో మొదలైన రెండో దశ పోలింగ్

 గుజరాత్లో మొదలైన రెండో దశ పోలింగ్

గుజరాత్ లో  రెండో దశ పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్లలో చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 833 మంది బరిలో ఉండగా.. 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకామేశ్వర్ ఆలయం సమీపంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలో ఓటు వేయనున్నారు. 

కాగా డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో మొత్తం 63.14 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ను ఏలుతోన్న బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తు్ండగా ఆ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్,ఆప్ భావిస్తున్నాయి.