
పద్మారావుగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కోసం ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ సనత్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమను మర్యాదపూర్వకంగా కలిశారు.
జులై 13న అమ్మవారికి బోనాలు, 14న రంగం, అంబారిపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆమె వారికి సూచించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గంటా గీత, ఠాకూర్ హేమంత్ సింగ్, రఘుల కృష్ణ, పాండురంగం, రాకేశ్ అగర్వాల్, ఆవుల శ్రీనివాస్, ఓనమాల అనిల్ కుమార్, గుంట మల్లికార్జున్, గుండెల్లి దేవి వరప్రసాద్, ఎతకుల వేణుగోపాల్ గౌడ్, పీట్ల జగదీశ్, శంబుల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.