
చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. చిరంజీవితో తనకున్న అనుబంధం దృష్ట్యా దర్శకుడు వి.వి.వినాయక్ ఈ మూవీ సెట్స్‌కి వచ్చి కాసేపు సరదాగా ముచ్చటించాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా విడుదల కానుంది.