క్రికెట్ అంటే రికార్డులు కాదు : వీవీఎస్ లక్ష్మణ్

క్రికెట్ అంటే రికార్డులు కాదు :  వీవీఎస్ లక్ష్మణ్

శ్రీలంక క్రికెటర్‌‌, స్పిన్‌‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీధరన్‌‌ పాత్రను మధుర్‌‌ మిట్టల్ పోషించగా, మహిమా నంబియార్‌‌ ఫీమేల్‌‌ లీడ్‌‌గా నటించింది. ఎం.ఎస్‌‌. శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్  అక్టోబర్ 6న పాన్ ఇండియా వైడ్‌‌గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘మురళీధరన్ మైదానంలో సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం కూడా అందరికీ ఇన్‌‌స్పిరేషన్‌‌గా ఉంటుంది. అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి ఆపోజిట్ టీంలో ఆడాను. వ్యక్తిగతంగానూ అతనితో పరిచయం ఉంది. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసున్న వ్యక్తి.  ఈతరం యువతకు రోల్ మోడల్. అతని లైఫ్‌‌ ఆధారంగా వస్తున్న సినిమా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు. మురళీధరన్ మాట్లాడుతూ ‘లక్ష్మణ్ గొప్ప క్రికెటర్. నాకు క్లోజ్ ఫ్రెండ్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌‌కు మేం చాలా రోజులు కలిసి పని చేశాం. మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ మేమంతా స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు. స్నేహితుల్ని చేసుకోవడం’ అని చెప్పారు. ‘క్రికెట్ మాత్రమే కాదు, ఈ సినిమాలో అంతకు మించి ఉంది. ప్రజలకు తెలియని మురళీధరన్ జీవితం ఎంతో ఉంది’ అని చెప్పాడు మధుర్ మిట్టల్. ఇదొక మెమరబుల్ మూవీ అని శివలెంక కృష్ణ ప్రసాద్  అన్నారు.

VVS Laxman,Cricket,Muralitharan,Tollywood,Telugu Cinema News,tollywood news,Latest Telugu Movie News 
VVS Laxman Cricket isn’t just a game for Muralitharan