టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేర్లు వింటే చాలు యూత్ లో ఒక తెలియని వైబ్ మొదలవుతుంది. ' గీతా గోవిందం ', 'డియర్ కామ్రేడ్ ' వంటి చిత్రాలతో వెండితెరపై ఈ జంట మ్యాజిక్ చేసింది. ఇప్పుడు నిజ జీవితంలోనూ వీరిద్దరూ ఒక్కటి కావాలిని కోట్లాది మంది అభిమానునలు ఎదురుచూస్తున్నారు. గత నాలుగేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారరు . ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగిపోందని ఇటీవల వారి సన్నిహితులు వెల్లడించారు.
ఫిబ్రవరి 26న పెళ్లి?
విజయ్ - రష్మిక వివాహం 2026, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 2025 అక్టోబర్‌లో దసరా పండుగకు ముందే వీరిద్దరూ అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారని సినీ వర్గాలు వెల్లడించారు. ఇప్పుడు ఆ వేడుకకు కొనసాగింపుగా, ఉదయ్‌పూర్‌లోని ఒక పురాతన ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సెలబ్రిటీల హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, ప్రాణమిత్రులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.
రష్మిక ఏమన్నారంటే?
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన పెళ్లి ప్రశ్నలకు రష్మిక చాలా తెలివిగా, నవ్వుతూ సమాధానమిచ్చారు. గత నాలుగేళ్లుగా ఈ పుకార్లు వస్తూనే ఉన్నాయి. అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ నిజం ఏమిటంటే.. ఏదైనా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు నేనే స్వయంగా చెబుతాను. సమయం వచ్చినప్పుడు మేమే అందరికీ వివరిస్తాం అని పేర్కొన్నారు. అయితే కెమెరా ఆఫ్ చేస్తే పెళ్లి గురించి చెబుతానని సరదాగా అనేసిందీ ముద్దుగుమ్మ.
ప్రేమ ప్రయాణం.. హింట్స్ ఇవే!
విజయ్ - రష్మిక తమ బంధాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు కానీ, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు అనేక హింట్స్ ఇస్తూనే ఉన్నారు . ఈ ఏడాది ప్రారంభంలో రోమ్ నగరంలో వీరు కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వేర్వేరుగా పోస్ట్ చేసినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్ ఒక్కటే కావడంతో నెటిజన్లు వీరిద్దరూ కలిసే ఉన్నారని ఫిక్స్ అయ్యారు. న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో విజయ్, రష్మిక జంటగా కనిపించి సందడి చేశారు. అంతే కాకుండా గత నవంబర్‌లో రష్మిక నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సక్సెస్ మీట్‌లో విజయ్ ఆమె చేతిపై ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఈ వీడియో అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.
►ALSO READ | Allari Naresh: హీరో అల్లరి నరేశ్ ఫ్యామిలిలో తీవ్ర విషాదం..
సినిమా కెరీర్ ముచ్చట్లు
ప్రస్తుతం రష్మిక చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. 'కాక్‌టెయిల్ 2', 'మైసా' చిత్రాలతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ఈ క్రేజీ జంట మళ్లీ కలిసి నటిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా, 'విజయ్ - రష్మిక' పెళ్లి వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా ఈ 'రౌడీ - లిల్లీ' జోడి మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
