Good Health : టార్గెట్ పెట్టుకుని ఇలా నడిస్తే టెన్షన్ ఫ్రీ

Good Health : టార్గెట్ పెట్టుకుని ఇలా నడిస్తే టెన్షన్ ఫ్రీ

వాకింగ్ చేస్తే ఫిట్నెస్ పెరుగుతుంది. కాళ్లకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బాడీ బ్యాలెన్స్ అవుతుంది. నలుగురితో కలిసి కబుర్లు చెప్పుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం అని పార్కుల్లో నడుస్తుంటారు చాలామంది. 

అయితే, వయసు మీద పడటంవల్ల మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. వాటివల్ల ఎక్కువ దూరం నడిస్తే కాళ్లకు ఇంకేదైనా జరుగుతుందని భయపడి ఇంట్లోనే కూర్చుంటారు కొందరు. అలాంటివాళ్లు ఈ జా గ్రత్తలు పాటిస్తూ నడవొచ్చు.

రోజుకు 5వేల అడుగులు నడవాలని టార్గెట్ పెట్టుకోవాలి. అలా ఓ వారం  నడిచాక మోకాళ్లలో ఎలాంటి నొప్పులు రాకుంటే ఇంకా కొన్ని అడుగుల్ని పెంచుకోవాలి. 

Also Read :- వెన్నునొప్పి తగ్గేందుకు మొసలిలా.. ఇలా

* వాకింగ్ మొదలు పెట్టడంతోనే వేగంగా నడుస్తుంటారు కొందరు. అలా కాకుండా నడక అలవాటు ఉంటేనే వేగంగా నడవాలి. 

* లేదంటే ముందు నెమ్మదిగా నడిచి తర్వాత వేగాన్ని పెంచాలి. నడుస్తుంటే మోకాళ్ల నొప్పులు రావడం కామన్. 

* అయితే ఆ నొప్పి రెండు రోజులకంటే ఎక్కువ ఉంటే డాక్టర్ ని కలవాలి.

* నడిచేటప్పుడు ఫ్లోరింగ్ బాగుందా లేదా చూసుకోవాలి. ఎగుడుదిగుడు నేలమీద కాకుండా చదునుగా ఉన్న రోడ్డు మీదే నడవాలి. 

* గుంతల రోడ్డులో వాకింగ్ చేస్తే మోకాళ్ల జాయింట్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హీల్ ఉన్నవి కాకుండా ఫ్లాట్గా, మెత్తగా ఉన్నవి. పాదానికి ఫిక్స్ అయ్యే షూ వాడాలి. బరువుగా ఉండే షూ అస్సలు వాడొద్దు.

* ఉదయం, సాయంత్రం ఎంత నడిచినా రోజు మొత్తం శరీరంలో కదలిక లేకపోతే వాకింగ్ చేసి లాభం ఉండదు. అంటే, ఒకే విధంగా కుర్చీలో కూర్చోవడం, బెడ్ పై పడుకోవడం చేయొద్దు. 

* కాళ్లను అప్పుడప్పుడు కదుపుతుండాలి. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి అటుఇటు నడవాలి.