Good Health : రాత్రిపూట తిన్న తర్వాత నడిస్తే.. టైప్ 2 షుగర్ రాదు

Good Health : రాత్రిపూట తిన్న తర్వాత నడిస్తే.. టైప్ 2 షుగర్ రాదు

రాత్రి భోజనం చేసిన వెంటనే మంచం ఎక్కుతున్నరా? అయితే ఈ వార్త మీ కోసమే!. న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో డిన్నర్ తర్వాత 15 నిమిషాలు నడిస్తే యుక్త వయసు వాళ్లు టైప్ 2 డయా బెటిస్ వ్యాధి బారిన పడకుండా కాపాడకోవచ్చని తేలింది. పగటి వేళ 45 నిమిషాల నడకకు ఇది సమానమని పరిశోధకులు అంటున్నారు. 

ALSO READ : Good Health : పుషప్స్ చేస్తే గుండెపోటు, గుండె జబ్బులు తక్కువ

అధిక శాతం మంది రాత్రే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. తిన్న వెంటనే టీవీ ముందు కూర్చొవడమో లేక నిద్రలోకి జారుకోవడమో చేస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్ కి దారి తీస్తుంది. అలాగే "నడుస్తున్నప్పుడు కండరాలు శక్తి కోసం గ్లూకోజ్ ని వినియోగించుకుంటాయి. అప్పుడు శరీరంలో ఎక్కువ మొత్తంలో సర్క్యూలేట్ అవుతున్న గ్లూకోజ్ తగ్గుతుందని అధ్యయనంలో వెల్లడైంది.