Good Health : జిమ్ కు వెళ్లటం లేదని బాధపడొద్దు.. ఆఫీసులో అటూ ఇటూ తిరగండి చాలు

Good Health : జిమ్ కు వెళ్లటం లేదని బాధపడొద్దు.. ఆఫీసులో అటూ ఇటూ తిరగండి చాలు

 రోజూ జిమ్ కి వెళ్ళాలంటే విసుగ్గా ఉంటోందా..? ఆఫీస్ కి  టైం సరిపోవడం లేదా... పర్లేదు, జిమ్ బంద్ చేయండి అంటున్నా రు అమెరికా క్యాన్సర్ సొసైటీ సెంటర్ వాళ్ళు. జిమ్ కి వెళ్ళకపో యినా మీరు ఆరోగ్యంగా ఉండే సూత్రం ఒకటుంది. వారానికి ఆరుసార్లు వాకింగ్ చేస్తే చాలు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వాళ్లు.

అలాగే రోజూ కొద్దిపాటి నడకవల్ల గుండెజబ్బులను నయం చేసుకోవచ్చని హేవార్డ్ మెడికల్ స్కూలు వాళ్లు కూడా నిర్ధారించారు. కూర్చున్నచోట అలాగే ఉండి పోకుండా గంటకొకసారైనా చిన్నగా అటూ ఇటూ నడుస్తూ ఉంటే ఆరోగ్యం మీవెంటే ఉంటుందట. కంప్యూటర్ కి కళ్లను, చైర్లకు నడుమును అతికించి, ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి  తొమ్మిది గంటల వరకూ కూర్చునే వాళ్లు గంటకొకసారి లేచి అటూ ఇటూ తిరగాలి. 

ఇలా నడక అలవాటు చేసుకుంటే నడుం నొప్పి, కళ్ళ బాధలు అంత త్వరగా మీ దరిచేరవు అంటున్నారు. అలాగే మెట్రో రైళ్లలో ప్రయాణం చేసేవారు తమ సీటుని పక్కవారికిచ్చి కాసేపు అక్కడ కూడా వాకింగ్ చేయొచ్చు. ఈ కిటుకు ఏదో బాగుంది కదా.. జిమ్ కెళ్ళడానికి సమయం లేక బాధ పడేవారు. జిమ్ అంటే బద్దకం ఉన్నవారు ఈ చిట్కాలు పాటించవచ్చు. మరి మీరు కూడా మీ వాకింగ్ మొదలుపెట్టేయండి ఇలా..!