
చెన్నై: హెచ్1బీ వీసా అవసరమున్న ఉద్యోగులను నియమించుకోవడాన్ని అమెరికాలో వాల్‌మార్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చిన కొత్త యూఎస్ పాలసీ ప్రకారం, ప్రతి కొత్త హెచ్1బీ వీసా పిటిషన్‌పై 100,000 డాలర్ల ఫీజు చెల్లించాలి. ఈ నిర్ణయంతో వాల్‌మార్ట్ వంటి పెద్ద కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంలో జాగ్రత్త పడుతున్నాయి.
ఈ కొత్త నిర్ణయంతో వాల్‌మార్ట్ టెక్నాలజీ, డేటా, ఫైనాన్స్ వంటి కార్పొరేట్ రోల్స్‌పై ప్రభావం పడుతుంది. స్టోర్ స్థాయి కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశాలు తక్కువ. ట్రంప్ వీసా పాలసీతో టెక్ కంపెనీలు హెచ్1బీ ద్వారా హైరింగ్ చేపట్టడాన్ని తగ్గిస్తున్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా భారతీయులపై తీవ్రంగా ఉంది. వాల్‌మార్ట్ నిర్ణయం తాత్కాలికమైనా, యూఎస్ ఉద్యోగ మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌ను ఇది స్పష్టం చేస్తోంది.