
వనపర్తి, వెలుగు: మధ్యవర్తిత్వం ద్వారా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న 654 కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టులో ‘90 రోజుల ప్రచారం, దేశం కోసం మధ్యవర్తిత్వం’ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్ 31 వరకు 90 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పెండింగ్ కేసులను పరిశీలించి మధ్యవర్తిత్వానికి అనుకూలంగా ఉన్న 654 కేసులను గుర్తించామని చెప్పారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి రజిని, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిరణ్ కుమార్, వెంకటరమణ, లాయర్లు కృష్ణయ్య, షాకీర్ హుస్సేన్, వెంకటేశ్, శోభారాణి, రాజు నాయక్, చందర్ నాయక్, రఘు, శ్రీదేవి పాల్గొన్నారు.