వనపర్తి జిల్లాలో పెండింగ్ జీతాలు చెల్లించండి : కేజీబీవీ హాస్టల్ వర్కర్లు

వనపర్తి జిల్లాలో పెండింగ్ జీతాలు చెల్లించండి : కేజీబీవీ హాస్టల్ వర్కర్లు

వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లాలోని కేజీబీవీ హాస్టల్ వర్కర్ల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సోమవారం  కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ..   కేజీబీవీ హాస్టల్స్ లో కొత్తగా పనిలో  చేరిన 13 మంది వర్కర్స్ కు 9  నెలల వేతనాలు పెండింగ్‌‌లో ఉన్నాయన్నారు. గత విద్యా సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ఖాళీలు ఉన్న కేజీబీవీలలో 13 మందిని హాస్టల్ వర్కర్లుగా నియమించుకున్నారు. 

కానీ ఇంతవరకు ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో  పి. అరుణ్ కుమార్,  గణేశ్, హాస్టల్ వర్కర్స్ రమాదేవి, మంజుల, జ్యోతి, మనీషా వెంకటేశ్ పాల్గొన్నారు.