వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం ఏదుల గ్రామంలో 2023, అక్టోబరు 31న మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు సింగం శివుడుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత ఏడేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు. పొలం పని ముగించుకుని వస్తున్న బాలికను అడ్డుకుని లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆమె ధైర్యంగా ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పటి ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసాచారి బలమైన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ సునీతారెడ్డి అభినందించారు.
